E Loka yathralo ne saguchunda........

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2) ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2) అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక|| జీవిత యాత్ర ఎంతో కఠినము (2) ఘోరాంధకార తుఫానులున్నవి (2) అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2) కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక|| నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2) అనుదినము నన్ను ఆదరించెదవు (2) నీతో ఉన్నాను విడువలేదనెడు (2) నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక|| తోడై యుండెదవు అంతము వరకు (2) నీవు విడువవు అందరు విడచినను (2) నూతన బలమును నాకొసగెదవు (2) నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||