నోటి మాటలను గూర్చి బైబిల్లో...
✓ పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
సామెతలు 26:24
✓ వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
సామెతలు 26:25
✓ అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.
సామెతలు 26:28
✓ తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు
తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.
సామెతలు 26:18,19
✓ నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.
సామెతలు 27:2
✓ నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
సామెతలు 28:23
✓ ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
సామెతలు 29:20
✓ 2. అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
✓ 3. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
✓ 4. మా నాలుకలచేత మేము సాధించెదముమా పెదవులుమావి, మాకు ప్రభువు ఎవడని వారను కొందురు.
కీర్తనలు 12:2,3,4
Praise the Lord, I am uploading all the verses from my daily readings regarding the mouth, talking(godly /ungodly). Plz comment if I miss anything. Thank you
ReplyDelete