మూర్ఖుల స్వభావాలు బైబిల్ లోనుండి...
✓ గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.
సామెతలు 26:3
✓ వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
సామెతలు 26:4
✓ వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.
సామెతలు 26:5
✓ మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు.
సామెతలు 26:6
✓ కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును
సామెతలు 26:7
✓ మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలో ముల్లు గుచ్చుకొన్న ట్లుండును.
సామెతలు 26:9
✓ అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.
సామెతలు 26:10
✓ తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.
సామెతలు 26:11
✓ తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.
సామెతలు 26:12
✓ మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.
సామెతలు 27:22
✓ రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
సామెతలు 27:3
Comments
Post a Comment