Posts

అతిపరిశుద్దుడా....song...

ప: అతిపరిశుద్ధడా... స్తుతినైవేద్యము       నీకే అర్పించి కీర్తింతును........"2"      నీవు నా పక్షమై నను ధీవించగా.,..      నీవు నా తోడు వై నను నడిపించగా...      జీ వింతును నీ కోసమే.......      ఆశ్రయమైన నా యేసయ్యా....         1. సర్వోన్నతమైన స్తలములయందు     నీ మహిమ వివరింపగా.......     ఉన్నతమైన నీ సంకల్పం ఎన్నడు ఆశ్చర్యమే.... "2"     ముందెన్నడూ చవిచూడని     సరిక్రొత్త దైన ప్రీమామృతం...      "2"     నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికీ                                                         "అతిపరిశుద్దుడా" 2. సాధ్గునరాశి నీ జాడలను - నాయేదుట నుంచుకొని     గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే "2"     కృప వెంబడి కృప పొందగా ...     మారాను మధురముగా నే పొంద...

మూర్ఖుల స్వభావాలు బైబిల్ లోనుండి...

Image
✓   గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము.                                                     సామెతలు 26:3 ✓ వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.                                                     సామెతలు 26:4     ✓   వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.                                                     సామెతలు 26:5 ✓ మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు.               ...

నోటి మాటలను గూర్చి బైబిల్లో...

✓ పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.                                                  సామెతలు 26:24      ✓ వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.                                                   సామెతలు 26:25 ✓ అబద్ధములాడువాడు తాను నలుగగొట్టినవారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.                                                 సామెతలు 26:28 ✓ తెగులు అమ్ములు కొరవులు విసరు వెఱ్ఱివాడు  తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.                     ...

దేవుని ఘర్ధింపు..

  దేవుని నామమున మీ అందరికీ వందనాలు .. దేవుడు నీలో ఎదైన లోపం గానీ లేదా ఆయనకి నచ్చనిది ఎదైన నీలో ఉన్నపుడు నిను ఘర్ధిస్తు ఉంటాడు, నీలో మార్పు ఆశిస్తాడు. ఆయన ప్రేమించు కుమారున్ని ఘర్ధిస్తాడని మర్చిపోకు... ఆయన గర్ధింపు నీ మీద ఉన్న ప్రేమతోనే, నీవు ఆయనతో ఉండాలని తప్ప ఇంకేమి కాదు. దేవుడు కొన్ని విధాలుగా నిను గర్ధిస్తాడు 1. వాక్యం ద్వారా 2. ప్రార్థనలో 3. సేవకుని ద్వారా 4. కలల ద్వారా  ఇంకా అనేక విధాలుగా మాట్లాడొచ్చు కానీ ఆయన చెప్పింది మనం విని, సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం, ఆయన ఎదురు చూచేది కూడా దానికోసమే...   అయితే సహజంగా మనలో అతి పరిశుద్ధులు ఉంటారు. వారి దృష్టికి వారు పరిశుద్ధులము అనుకొని వారిలో ఉన్న లోపాలు వారు తెలుసుకొని గ్రుడ్డితనం లో బ్రతుకుతారు. అలాంటి వారికి ( 2 దినవృతంతములు 18:7) లో ఉన్న ఆహాబు రాజు ఒక మంచి ఉదాహరణ. ఆహబు రాజు మరియు యూదా రాజైన యెహోషాపాతు తో కలిసి యుద్ధానికి వెళ్ళే ముందు యూదా రాజు అంటాడు వెళ్ళేముందు ఒక దేవుని సేవకుని సహాయం తో దేవుని సలహా తిస్కుందం అని ( 2 దిన 18 : 1-10 ) కానీ ఆహాబు రాజుకి ఆ సేవకుండంటే కోపం ఎందుకంటే ఆ ప్రవక్త ఎప్పుడు రాజుకు వ్యతిరేకంగా...

E Loka yathralo ne saguchunda........

Image
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ  (2) ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు  (2) అయినాను క్రీస్తేసు నా తోడనుండు  (2)       ||ఈ లోక|| జీవిత యాత్ర ఎంతో కఠినము  (2) ఘోరాంధకార తుఫానులున్నవి  (2) అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు  (2) కాయు వారెవరు రక్షించేదెవరు  (2)       ||ఈ లోక|| నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా  (2) అనుదినము నన్ను ఆదరించెదవు  (2) నీతో ఉన్నాను విడువలేదనెడు  (2) నీ ప్రేమ మధుర స్వరము విన్నాను  (2)       ||ఈ లోక|| తోడై యుండెదవు అంతము వరకు  (2) నీవు విడువవు అందరు విడచినను  (2) నూతన బలమును నాకొసగెదవు  (2) నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే  (2)       ||ఈ లోక||

పరిశుధుడు...పరిశుధుడు పరిశుధుడు అని

పరిశుధుడు...పరిశుధుడు (2) పరిశుధుడు అని  నిత్యమూ దూతలతో  కొనియాడబడుతున్నా నా యేసయ్యా. ......(2) వందనం ప్రభు వందనం (2)    1. సర్వలోకము నీ మహిమతో         నిండియున్నది దేవా...          గమధనిస  ...   గమధనిస.... గమధనిస    సర్వలోకము నీ మహిమతో  నిండియున్నది          దేవా...   గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును (2) గాన ప్రతి గానము చేసేద నేను....(2) 2. నా ఖంఠ స్వరము వలన - గడప కమ్ముల    పునాదులు కదులుచున్నవి దేవా...   గమదనిస..... గమదనిస.... గమదనిస...    నా ఖంఠ స్వరము వలన - గడప కమ్ముల    పునాదులు కదులుచున్నవి దేవా...   నా దేహమనే నీ ఆలయమందు....(2)   స్తుతి దూమము వేసెద నిరతము నేను..(2)                                             "  పరిశుధుడు ...."   ( సగమ.... దనిస...నిస.. గమస..      పరిశుధుడ...

మరణాన్ని గెలచిన దేవా.....

మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న ప్రాణముతో గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా అభిషేకనాధుడా నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న